
జనరల్

ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్' జాబితాలో నారా బ్రాహ్మణికి చోటు దక్కడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇది ఆమె నాయకత్వం, అంకితభావానికి దక్కిన అరుదైన గుర్తింపని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి, మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు. బ్రాహ్మణి సాధించిన ఈ గుర్తింపు మహిళలకు స్ఫూర్తిదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రి నారా లోకేశ్ కూడా బ్రాహ్మణి విజయంపై హర్షం వ్యక్తం చేశారు. 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో ఆమె చోటు దక్కడం గర్వకారణమని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇదే పట్టుదలతో ముందుకు సాగుతూ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!