

‘శంబాల’ చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి అర్చన అయ్యర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అ’. ఇటీవల అడివి శేష్ విడుదల చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ‘బ్లడీ హంగర్’ పేరుతో ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్‌లో రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 9న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదలైన గ్లింప్స్ భయానక దృశ్యాలు, ఆసక్తికరమైన కథనం, పదునైన ఎడిటింగ్‌తో ఆకట్టుకుంటోంది. యువతుల అదృశ్యానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన దర్యాప్తు చుట్టూ కథ సాగనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ‘అమ్మాయి’, ‘అదృశ్యం’, ‘అన్వేషణ’ అనే పదాలతో సినిమా ప్రధానంగా దర్యాప్తు నేపథ్యంలో ఉంటుందని ఆసక్తిని పెంచారు. మొత్తంగా ఈ గ్లింప్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!