
క్రీడలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై 35 సంవత్సరాలు పూర్తయ్యాయి. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్, యాక్షన్, ప్రేమ సన్నివేశాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. చిరంజీవి–విజయశాంతి కెమిస్ట్రీ, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా కథలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత వేరే కథతో రూపొందించాలనుకున్న దర్శకుడు విజయ బాపినీడు, తర్వాత పరుచూరి బ్రదర్స్ సలహాలతో కథను పూర్తిగా మార్చారు. రఘుపతి, రాఘవ, రాజారామ్ అన్నదమ్ముల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా అప్పట్లో 100 రోజుల వేడుకలు ఘనంగా జరుపుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విజయవంతమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!