

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ ఇప్పటికే భారీ స్థాయి ప్రాజెక్ట్‌గా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘అరవింద సమేత’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో ధనుష్, వెట్రిమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘తమిళ్ మురుగన్’ కూడా సుబ్రహ్మణ్య స్వామి కథా నేపథ్యంతో తెరకెక్కుతోందన్న ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. రెండు చిత్రాల్లోనూ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రధాన అంశంగా ఉండబోతోందని, రాక్షసులపై సుబ్రహ్మణ్య స్వామి చేసిన యుద్ధాల చుట్టూనే కథ తిరుగుతుందని సమాచారం.
‘తమిళ్ మురుగన్’ ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో, ‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్‌పై త్రివిక్రమ్ మరోసారి దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి పాత్రలోని దైవత్వం, ఆధ్యాత్మికత, భావోద్వేగాలను మరింత బలంగా ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతోంది. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!