

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని జంటగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ ప్రారంభం నుంచే హీరో, హీరోయిన్ పాత్రలను భావోద్వేగభరిత పరిస్థితుల్లో పరిచయం చేస్తూ ప్రేమకథలోని తీవ్రతను చూపించే ప్రయత్నం కనిపించింది. ఇద్దరి ప్రేమ ప్రయాణం విషాదాంతం వైపు దారి తీస్తుందా అనే ఉత్కంఠను సృష్టించేలా సన్నివేశాలను కట్ చేసిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. అజయ్ భూపతి టేకింగ్, విజువల్ ప్రెజెంటేషన్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా మారాయి.
జయకృష్ణ ఘట్టమనేని మాస్ లవర్ బాయ్‌తో పాటు యాక్షన్ హీరోగా కూడా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. రాషా తడాని పాత్రను దర్శకుడు అందంగా, హుందాగా తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మోహన్ బాబు పాత్ర కథలో కీలక మలుపులకు కారణం కానుందనే సంకేతాలు ట్రైలర్‌లో కనిపించాయి. తొలి భాగంలో ప్రేమకథ, రెండో భాగంలో యాక్షన్ ఘట్టాలు, చివర్లో భావోద్వేగ సన్నివేశాలతో సినిమా సాగనున్నట్లు అర్థమవుతోంది. జీవీ ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌ను మరింత బలంగా నిలబెట్టింది. జూలై 30న విడుదల కానున్న ఈ చిత్రాన్ని చందమామ కథలు, ఆనంద్ సాయి ఆర్ట్స్ నిర్మించగా వైజయంతి మూవీస్ విడుదల చేయనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!