
రాజకీయాలు

ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదానికి కేంద్రబిందువయ్యారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నటుడు కాంతారావు నటించిన జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ భయపడేవారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ సినీ అభిమానుల మధ్య విస్తృత చర్చకు దారితీశాయి.
ఇక ఇటీవల జరిగిన మరో కార్యక్రమంలో ఒక అభిమాని సెల్ఫీ కోరగా రాజేంద్ర ప్రసాద్ చిరాకు వ్యక్తం చేస్తూ అతడిని పక్కకు నెట్టిన ఘటన కూడా విమర్శలకు కారణమైంది. ఈ రెండు ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రముఖులు అభిమానులతో మర్యాదగా ప్రవర్తించాలంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!