

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ‘లెనిన్’ చిత్రంతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుని పరిశ్రమలో తన స్థాయిని పెంచుకున్నారు. ఈ విజయంతో ఆమెకు వరుస ఆఫర్లు రావడంతో ఫుల్ బిజీగా మారినప్పటికీ, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినీ రంగంలోకి రావాలన్న తన నిర్ణయానికి కుటుంబం నుంచి మొదట తీవ్ర వ్యతిరేకత ఎదురైన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.
మోడలింగ్, సినిమాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు తల్లి వెంటనే నిరాకరించగా, తండ్రి కూడా గట్టిగా మందలించి ఫోన్ కట్ చేశారని తెలిపారు. అక్క కూడా మద్దతు ఇవ్వకపోయినా, నటనపై ఉన్న ఆసక్తితో ధైర్యంగా ఆడిషన్లు ఇచ్చానని చెప్పారు. ఈ నిర్ణయంతో ఆగ్రహించిన తల్లి తనను వాట్సాప్లో బ్లాక్ చేసి ఆరు నెలల పాటు మాట్లాడలేదని, ఆ సమయంలో తీవ్ర మానసిక బాధ అనుభవించానని చెప్పారు. అయితే తన విజయాన్ని చూసిన తర్వాత కుటుంబ సభ్యులందరికీ తనపై నమ్మకం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!