

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రభాస్ ఈ చిత్రానికి భారీగా కాల్షీట్లు కేటాయించినట్లు సమాచారం. సెప్టెంబర్ నాటికి తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసి, తదుపరి ప్రాజెక్ట్‌కు వెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ఒకేసారి మూడు యూనిట్లు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను హను రాఘవపూడి స్వయంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మరోవైపు ‘ఫౌజీ’ విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 3న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రిలీజ్ డేట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ షూటింగ్ భాగం త్వరగా పూర్తవుతుండటంతో తదుపరి దశ పనులపై మేకర్స్ దృష్టి సారించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!