
సినిమాలు

యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా 40కు పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో యశ్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తూ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టారు.
ఈ చిత్రంలో యశ్‌తో పాటు తారా సుతారియా, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!