
సినిమాలు

విజయనగరం ఎంజీ రోడ్‌లోని 21వ గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ శనివారం ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీనటి రితికా నాయక్ షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆమెను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు . రితికా నాయక్ మాట్లాడుతూ, యువతలు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరమని, షోరూంలో విస్తృతమైన సిల్వర్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 24 నుండి వచ్చే నెల 15 వరకు ప్రత్యేక ఆఫర్లతో షోరూం ప్రారంభాన్ని వేడుకగా జరుపుతామని, గోయాజ్ జ్యువెలరీ ఛైర్మన్ వేములూరి రాజేంద్ర కుమార్ తెలిపారు . అతి తక్కువ కాలంలోనే గోయాజ్ ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అని తెలిపారు. అలాగే, త్వరలో దక్షిణ భారతదేశంలో ఐదు షోరూమ్‌లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు, ఇది బ్రాండ్ విస్తరణలో కీలకమైన అడుగు అని చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!