
క్రీడలు

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘దృశ్యం 3’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. దర్శకుడు జీతూ జోసెఫ్ టేకింగ్, మోహన్ లాల్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం బలమైన వసూళ్లు సాధిస్తూ మరో విజయంగా నిలుస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ట్రేడ్ వర్గాల ప్రకారం సరైన ప్రమోషన్స్ లేకపోవడం, ప్రారంభంలో వచ్చిన మిక్స్డ్ టాక్ సినిమాపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో మలయాళ వెర్షన్‌పై ఆసక్తి తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా వెంకటేష్‌తో రీమేక్ చేసి ఉంటే మరింత మంచి స్పందన వచ్చేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!