
సినిమాలు

విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడైంది. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్యాగా గుర్తింపు పొందిన ఆయన, ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి క్రేజ్ ఉన్న ఆయన టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు.
ఫ్యామిలీ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెడీ, ఎమోషన్స్‌తో పాటు దివ్యేందు పాత్రలో ప్రత్యేక ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!