

పశ్చిమ బెంగాల్లో మూతపడిన 14 జూట్ మిల్లులు నెలరోజుల్లోనే తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడంతో రాష్ట్ర జూట్ పరిశ్రమకు కొత్త ఊపు లభించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరగా, దీర్ఘకాలంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు మళ్లీ జీవనోపాధి కలిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సాంప్రదాయ జూట్ పరిశ్రమ పునరుద్ధరణకు ఇది ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.
రాష్ట్ర కార్మిక శాఖ సమాచారం ప్రకారం, ఇప్పటికే పలు మిల్లుల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. మరికొన్ని మిల్లుల్లో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చివరి దశలో ఉన్నాయి. జగ్దల్, ఎంపైర్ ఎమ్కో, భారత్, లమ్టెక్స్ జూట్ మిల్లులు కూడా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూట్ పరిశ్రమ పునరుజ్జీవనంతో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించి, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!