
క్రీడలు

తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ మరియు శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. అసోసియేషన్ వ్యవహారాలపై జరిగిన చర్చల సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఫెడరేషన్ అనుమతి లేకుండానే ఉపఎన్నిక నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే అంశంపై ఈ వివాదం మరింత ముదిరినట్లు సమాచారం. దీనికి నిరసనగా సుమారు 10 మంది డాన్సర్లు అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ పరిణామాలపై అసోసియేషన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!