

రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమా భారతదేశంలో అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్లకు చేరువవుతుండటంతో సినీ వర్గాల్లో విశేష చర్చ జరుగుతోంది.
అయితే, ఈ సినిమా చుట్టూ తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. సినిమాలో చూపించిన కొన్ని ప్రాంతాలు తమవేనని పేర్కొంటూ, పాకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని బ్యాక్‌డ్రాప్‌గా ఉపయోగించి సినిమా ద్వారా భారీగా లాభాలు సంపాదించారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, సినిమా వసూళ్లలో 50 నుంచి 80 శాతం వరకు తమకు వాటా ఇవ్వాలని, లేదా కనీసం తమ ప్రాంతంలో ఒక ఆసుపత్రిని నిర్మించాలని వారు కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారత్‌లో సినిమా పై నిషేధం వంటి అంశాలు ఉన్నప్పటికీ, మరోవైపు తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించారనే కారణంతో వసూళ్లలో వాటా కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ డిమాండ్ల పై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!