
సినిమాలు

కోలీవుడ్ స్టార్ ధనుష్, దర్శకుడు రాజ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ కెరీర్‌లో 55వ చిత్రంగా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వండర్‌బార్ ఫిలింస్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, చెన్నైలోని రెడ్ హిల్స్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ధనుష్, శ్రీలీలపై ఒక ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇద్దరి డ్యాన్స్ కాంబినేషన్‌ను వెండితెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!