

వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఎక్కడ చూసినా ఈ సినిమా నవ్వులు పంచుతోందనే మాట వినిపిస్తోందని పేర్కొంటూ, వరుణ్ తేజ్ తన కష్టం, నిబద్ధతతో ఈ విజయానికి పూర్తిగా అర్హుడని కొనియాడారు. చిత్ర బృందం గొప్ప విజయాన్ని అందుకుందని పేర్కొంటూ, త్వరలోనే సినిమా చూసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు.
మరోవైపు నటి లావణ్య త్రిపాఠి కూడా వరుణ్ తేజ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి చిత్రాన్ని ఎంతో అంకితభావంతో పూర్తి చేసే వరుణ్‌కు ‘కొరియన్ కనకరాజు’ మరో మైలురాయిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. కొత్త కథలు, కొత్త జానర్లను ఎప్పటికప్పుడు అన్వేషించే ఆయన తపన, కృషే అద్భుతమైన నటుడిగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!