
జనరల్

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్-2026 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదలతో పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియకు మార్గం సుగమమైంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!