

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం హాజరుకానున్నారు. తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం.
తెలంగాణ అభివృద్ధి అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులు, కరువు ముప్పు, సాగునీటి అవసరాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరనున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!