

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు – తమిళ ద్విభాషా చిత్రం కార్మేని సెల్వం వచ్చే నెల 3, 2026 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ సినిమాకు అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరి దేశవ్యాప్తంగా భారీ విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
నిజాయితీగా జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈ కథ సాగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడో భావోద్వేగంగా చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి ఆసక్తిని రేకెత్తించగా, త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!