
సినిమాలు

కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ నటిస్తున్న ‘సేయోన్’ సినిమా భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ చిత్రం కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ఇటీవల కమల్ హాసన్‌ను కలిశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
భాగ్యశ్రీ తన పోస్టులో చిన్నప్పటినుంచి కమల్ హాసన్‌ను చూస్తూ పెరిగానని, ఇప్పుడు ఆయన నిర్మాణంలో నటించడం తనకు ఎంతో భావోద్వేగంగా అనిపించిందని తెలిపారు. ఆయన ఆశీర్వాదం పొందిన క్షణాలు జీవితంలో మరువలేనివని పేర్కొన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శివ కుమార్ మురుగేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలు, మాస్ యాక్షన్, వినోదం కలగలిపిన కథగా రూపొందుతోంది. అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!