

యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ థ్రిల్లర్ ‘హైందవ’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. గతంలో విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ దైవిక అంశాలు, ఉత్కంఠభరిత దృశ్యాల మేళవింపుతో ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం టీజర్‌ను అక్టోబర్ 14న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీనివాస్ చేతిలో గొడ్డలితో ఉగ్రరూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్నారు.
నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’ హిందూ ధర్మం నేపథ్యంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామాగా తెలుస్తోంది. మూన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై మహేశ్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలు, యాక్షన్ సన్నివేశాల కలయికతో రూపొందుతున్న ఈ సినిమాపై టీజర్ విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!