

‘కోర్ట్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్ష రోషన్, శ్రీదేవి జంట మరోసారి బ్యాండ్ మేళం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బ్లాక్‌బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శ్రీ రామనవమి సందర్భంగా ఈ నెల 26 న విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ‘తిప్పూ కుంటున్నావ్’, ‘పల్లెలోని సందల్లన్నీ మీవే’ వంటి పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రమోషన్స్‌కు సమయం ఉండటంతో చిత్రబృందం డిఫరెంట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటించగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించారు. శివ ముప్పరాజు ఎడిటింగ్ మరియు స్క్రీన్‌ప్లే బాధ్యతలు నిర్వర్తించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!