

నటసింహం నందమూరి బాలకృష్ణ 2004లో ‘నర్తనశాల’ చిత్రంతో దర్శకుడిగా చేసిన ప్రయాణాన్ని, సినిమా పట్ల తన దృక్పథాన్ని, అలాగే దివంగత నటుడు శ్రీహరి ఎదుగుదలలో తన పాత్రను వివరించారు. తన ఆలోచనా విధానానికి తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్ అనిపించడంతోనే దర్శకత్వం చేపట్టానని తెలిపారు. కో-డైరెక్టర్ సహాయంతో పని చేశానని, ప్రతి విషయం తనకు తెలుసనే భావన సరైంది కాదని, వినయంగా ఉండటం అవసరమని బాలకృష్ణ స్పష్టం చేశారు. సినిమా పట్ల తాను ప్యాషన్‌తోనే పనిచేస్తానని, ప్రతి చిత్రం కొత్త ప్రయాణమని చెప్పారు.
శ్రీహరిని ‘నర్తనశాల’లో భీముడి పాత్రకు తీసుకున్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన టాలెంట్‌ను ముందే గుర్తించానని తెలిపారు. శ్రీహరి తనకు సన్నిహిత మిత్రుడని, ఆయనలో ఉన్న ఫిజిక్, టాలెంట్ అరుదైన కలయిక అని ప్రశంసించారు. అలాగే ‘నరసింహనాయుడు’ షూటింగ్ సమయంలో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే ప్రేక్షకుల్లో భయాన్ని కలిగించగలిగానని చెప్పారు. సౌందర్య మరణంతో ఆగిపోయిన ‘నర్తనశాల’ తన కలల ప్రాజెక్ట్‌గా మిగిలిపోయిందని ఆయన భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!