
క్రీడలు

తెలుగు సినిమాను పూర్తిగా మార్చిన చిత్రం ‘బాహుబలి’ గురించి ప్రత్యేకంగా రూపొందించిన ‘బాహుబలి: ద టార్చ్ బేరర్’ అనే డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైంది. నాలుగు ఎపిసోడ్లుగా 123 నిమిషాల నిడివితో రూపొందిన ఈ డాక్యుమెంటరీలో, ఈ ఎపిక్ సినిమా ఎలా రూపుదిద్దుకుంది, తెర వెనుక జరిగిన సంఘటనలు, నటీనటుల అనుభవాలు అన్నీ వివరంగా చూపించారు.
ఒక సినిమాగా మొదలైన ఆలోచన ఎలా రెండు భాగాల భారీ ప్రాజెక్ట్‌గా మారింది, భారీ బడ్జెట్, ప్రారంభ టాక్ తర్వాత ఎదురైన భయాలు, మానసిక ఒత్తిళ్లు వంటి విషయాలను ఇందులో వెల్లడించారు. జపాన్ సహా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన, అభిమానుల భావోద్వేగ కథలు, అలాగే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పంచుకున్న అనుభవాలు ఈ డాక్యుమెంటరీని మరింత ఎమోషనల్‌గా మార్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!