
గాసిప్స్

వానర చిత్రం ద్వారా అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. హీరోయిన్గా సిమ్రాన్ చౌదరి నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రలో నందు కనిపించనున్నారు. శంతను పతి సమర్పణలో, సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, వివేక్ సాగర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
పౌరాణిక గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన వానర న్యూ ఇయర్ స్పెషల్‌గా జనవరి 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. టీజర్ 2 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించగా, తాజాగా విడుదలైన తొలి పాట “అదరహో”కు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!