

మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ తన గత ప్రేమాయణం, బ్రేకప్‌పై మరోసారి స్పందించి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. కొద్ది రోజుల క్రితం తన మాజీ ప్రియుడు విచిత్రంగా ప్రవర్తించేవాడని, తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా కెరీర్‌ను కూడా నియంత్రించేందుకు ప్రయత్నించాడని ఆమె వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ బంధం ముగియడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రేమ ఎంత అందమైనదో, ఇద్దరు వ్యక్తులు విడిపోవడం కూడా జీవితంలో ఒక అర్థవంతమైన భాగమని అనుపమ అభిప్రాయపడ్డారు. బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనల్ని మనం అర్థం చేసుకోవడం, వ్యక్తిగతంగా మెరుగుపడటం, మరింత మంచి వ్యక్తులుగా ఎదగడం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తన దృష్టిలో బ్రేకప్ కేవలం బాధ మాత్రమే కాదని, కొత్తగా ఎదగడానికి ఒక అవకాశమని ఆమె భావిస్తున్నారు. ప్రేమలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలనే ఆమె అభిప్రాయంపై నెటిజన్లు స్పందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!