

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 18లో సరదా సంభాషణ చోటుచేసుకుంది. హాట్‌సీట్‌లో ఉన్న అహేలి అనే కంటెస్టెంట్.. జయా బచ్చన్ బెంగాల్‌కు చెందినవారని గుర్తుచేస్తూ, అమితాబ్‌ను ‘బెంగాల్ అల్లుడు’గా పరిచయం చేసి కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా అత్తగారు, మామగారిలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని ప్రశ్నించగా.. అమితాబ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన అత్తగారంటేనే ఇష్టమని సమాధానమిచ్చారు.
అనంతరం అహేలి.. అత్తగారింట్లో దేనిని ఎక్కువగా మిస్ అవుతారని ప్రశ్నించగా, అమితాబ్ తనదైన హాస్యశైలిలో స్పందించారు. “అత్తగారింటి నుంచి వచ్చేవాళ్లు దానిని మిస్ అవ్వాలి కానీ, నేనెందుకు మిస్ అవుతాను?” అంటూ నవ్వులు పూయించారు. దీంతో కేబీసీ ఎపిసోడ్ మరింత సందడిగా మారింది. కాగా, జయా బచ్చన్ తల్లిదండ్రులు ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ తరుణ్ కుమార్ భాదురి, ఇందిరా భాదురి. అమితాబ్, జయా బచ్చన్‌ల వివాహం 1973లో జరిగింది. ఈ దంపతులకు అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా ఇద్దరు సంతానం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!