

ఫాదర్స్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై చేసిన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నా తండ్రే నా దైవం.. కంటికి కనిపించే, మాట్లాడే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో సర్వస్వం కూడా ఆయనే’ అంటూ బన్నీ రాసిన మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తండ్రిపై తనకున్న ప్రేమ, గౌరవం, అభిమానాన్ని హృదయానికి హత్తుకునేలా వ్యక్తం చేశారు.
అల్లు అరవింద్‌తో కలిసి దిగిన ప్రత్యేక ఫొటోతో పాటు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు స్వరంతో కూడిన వీడియోను కూడా అల్లు అర్జున్ పంచుకున్నారు. దీంతో ఈ పోస్ట్ మరింత భావోద్వేగంగా మారింది. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని గుర్తు చేస్తూ బన్నీ చేసిన ఈ సందేశం అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఇదిలా ఉంటే, పుష్ప 2 ఘన విజయానంతరం దర్శకుడు అట్లీతో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ పనులతో అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!