

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’పై నటి ఆలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, సాహసాలు, వైభవంతో కూడిన ఈ సినిమా తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని అలియా తెలిపారు. షూటింగ్ సమయంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని, ఎంతో ఆనందంగా పని చేసిన చిత్రాల్లో ‘ఆల్ఫా’ కూడా ఒకటిగా నిలుస్తుందని ఆమె చెప్పారు.
ఈ సినిమా కథ ఇద్దరు మహిళా ప్రధాన పాత్రల చుట్టూ తిరగడం తనకు అత్యంత నచ్చిన అంశమని ఆలియా పేర్కొన్నారు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని, ‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు, ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. దర్శకుడు శివ్ రావైల్, నటీనటులు, యాక్షన్ బృందం, సాంకేతిక సిబ్బంది అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారని చెప్పారు. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!