

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సీక్వెల్ “అఖండ 2 తాండవం” కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యి ఉంటే ఈ పాటికే షోస్ పడి టాక్ కూడా తెలిసిపోయేది కానీ ఊహించని విధంగా కొన్ని సమస్యల మూలాన పరిస్థితులు చేదాటిపోయాయి. అయితే ఈ సమస్యలు మేకర్స్ దాదాపు పరిష్కరించినప్పటికీ, జరగాల్సిన నష్టం అయితే జరిగింది. ఫైనాన్స్ సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి కానీ ఈరోజు లోపు పూర్తి క్లారిటీ రావచ్చని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. కానీ ఒక్కసారి ఆగిన రిలీజ్ మళ్ళీ ఎప్పుడు విడుదల చేయాలి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ప్రత్యేకంగా యూఎస్ మార్కెట్లో ఇబ్బందులు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అక్కడ ఆల్రెడీ ఒక ప్లానింగ్ ప్రకారం నడుస్తుంది. పైగా హిట్ హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చిన్న పొరపాటు జరిగినా కేటాయించిన స్క్రీన్స్ చేజారిపోతాయి. అది రోజు రోజుకి సినిమాకి వచ్చే కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది. దీనితో సాధ్యమైనంత వెంటనే రిలీజ్ చేసుకుంటే మంచిది అని అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఒక వారం ఆలస్యం అయినా ఇతర సినిమాల పోటీ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పెట్టుకున్న టార్గెట్లను చేరడం కూడా కష్టంగా మారొచ్చు. అందుకే సినిమా ఎంత త్వరగా రిలీజ్ అయితే అంత మంచిది. అయితే ఎక్కువ రోజులు వాయిదా పడితే అభిమానులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!