
తాజాగా ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు కాంతారావు అవార్డు అందజేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, మహానటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై తమిళ సినీ పరిశ్రమలో కొంత అసంతృప్తి వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు నాజర్ సహా పలువురు సినీ ప్రముఖులు స్పందించడంతో రాజేంద్ర ప్రసాద్ ఒక వీడియో ద్వారా క్షమాపణలు తెలిపారు. తమిళంలో విడుదల చేసిన ఆ వీడియోలో, తాను సరదాగా మాట్లాడే క్రమంలో పొరపాటున ఆ వ్యాఖ్య చేశానని, ఎంజీఆర్‌ను అవమానించాలనే ఉద్దేశం లేదని చెప్పారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న సమయంలోనే ఎంజీఆర్ తనకు ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే క్షమించాలని కోరుతూ, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని హామీ ఇచ్చారు.

.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!