

బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కు సోమవారం రాత్రి ముంబై లో ప్రమాదం జరిగింది. అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా విదేశీ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ముంబైలోని జుహూ ప్రాంతంలో, కాన్వాయ్ ముందుగా వెళ్తున్న ఒక ఎస్కార్ట్ వాహనానికి ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగంతో వచ్చిన ఒక మెర్సిడెస్ కారు ముందు ఉన్న ఆటోను ఢీకొట్టడంతో, ఆ ఆటో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న అక్షయ్ ఎస్కార్ట్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న దెబ్బకు ఎస్కార్ట్ వాహనం రోడ్డు పై పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో ఆటో పూర్తిగా దెబ్బతినగా, ఆటో డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ప్రయాణిస్తున్న మరో ఎస్‌యూవీకి స్వల్పంగా నష్టం వాటిల్లినప్పటికీ, వారిద్దరూ సురక్షితంగానే ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. అక్షయ్ కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్న వార్తతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!