
.jpeg&w=3840&q=75)
రాజమౌళి “వారణాసి” టీజర్‌ను టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేశారు. అంతటి భారీ కాంబినేషన్ ఉన్నా, టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండానే ప్రపంచ మార్కెట్‌ను టార్గెట్ చేశారు. ప్రియాంక చోప్రా, మహేష్ బాబు కాంబోతో భారీ రికార్డులు వస్తాయని అనుకున్నారు కానీ, మొత్తం అధికారిక యూట్యూబ్ ఛానెల్స్ కలిపి కూడా 20 మిలియన్ వ్యూస్ దాటలేదు.
ప్రస్తుతం T-Series మెయిన్ ఛానెల్లో 15 మిలియన్ వ్యూస్, T-Series తెలుగు 1.7 మిలియన్, తమిళ 600K, మలయాళం 200K మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్యలు తక్కువగా అనిపించినా, ఇవి పూర్తిగా ఆర్గానిక్ వ్యూస్. రాజమౌళి టీమ్ ఏమాత్రం కొనుగోలు చేసిన వ్యూస్, లైక్స్ లేదా కామెంట్స్ తీసుకోలేదు. నేటికాలంలో చాలా సినిమాలు నకిలీ వ్యూస్ కొనుగోలు చేస్తూ హడావుడి చేస్తున్న నేపథ్యంలో, ఇవి నిజమైన సంఖ్యలే.
ఇప్పుడు రీల్స్‌కే ఎక్కువ వ్యూస్ వచ్చే ట్రెండ్‌లో, ఫేక్ మెట్రిక్స్ కాకుండా కంటెంట్‌పైనే నమ్మకం పెట్టుకోవడం రాజమౌళి నిర్ణయం. “వారణాసి” పరిశ్రమలో కొత్త ప్రమాణాలు సెట్ చేసే అవకాశం ఉంది. ఇకపై ఎవరు వ్యూస్ కొనుగోలు చేసినా, ఇవే బెన్చ్మార్క్గా మారేలా కనిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!