

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కే. శివకుమార్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. కర్ణాటక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. తిరుమలను దేశంలోనే ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ పాలకమండలి కృషి చేస్తోందని కొనియాడారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, అధికారులు భక్తి భావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమల అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారని అభినందించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!