
ఓటీటీ

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించడం తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి రావడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!