
క్రీడలు

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్, చాలా కాలం తర్వాత మళ్లీ హీరోగా “ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే జిష్ణు నిర్మిస్తుండగా, కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, శిల్పా తులస్కర్, రఘుబాబు, శివన్నారాయణ, బాబా బాస్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కుటుంబ భావోద్వేగాలు, వినోదం కలగలిపిన కొత్త కథనంతో సినిమా రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. దాదాపు పదేళ్ల తర్వాత వడ్డే నవీన్ రీ ఎంట్రీ కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!