
.webp&w=3840&q=75)
KGF ఫ్రాంచైజ్ తర్వాత పెద్ద హైప్‌ను సంపాదించిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ ప్రాజెక్ట్‌పై పనిచేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేస్తుండటం తనకు ఇంటికి తిరిగి వచ్చినట్టే అనిపిస్తోందని చెప్పారు.
“ఈ సినిమా విజువల్‌గా, మ్యూజికల్‌గా కూడా భారీ స్థాయిలో ఉంటుంది. KGF, సలార్‌లా కాకుండా పూర్తిగా కొత్త సౌండ్ డిజైన్‌తో వస్తున్నాం. కొత్త వాద్య పరికరాలు, కొత్త ఎనర్జీ, కానీ భావోద్వేగాలకు దగ్గరగా ఉండే మ్యూజిక్ అందిస్తున్నాం” అని రవి బస్రూర్ వెల్లడించారు.
సలార్‌లో వివిధ రకాల పాటలు ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఇంకా వైవిధ్యమైన సంగీతాన్ని ఆశిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న నేపథ్యంలో మెలోడీ కూడా వచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. “ఈసారి సంగీతం మరింత భిన్నంగా ఉండబోతోంది” అనే రవి కామెంట్‌తో సినిమా మీద ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!