

ప్రముఖ దర్శకుడు ఎ కోదండరామి రెడ్డి చేతుల మీదుగా రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ కొత్త మలుపు ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా, భైరవి అర్ధ్యా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మించారు. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ జూన్ 12న విడుదల చేయనున్నారు.
ట్రైలర్‌ను ప్రశంసించిన కోదండరామి రెడ్డి, సినిమా కాన్సెప్ట్‌తో పాటు హీరో, హీరోయిన్ నటన ఆకట్టుకుందని పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, హాస్యం, కుటుంబ భావోద్వేగాలు సమపాళ్లలో ఉంటాయని చిత్రబృందం తెలిపింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఆకాష్–భైరవి జంట, వినోదాత్మక కథనం, కామెడీ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!