

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన భారీ చిత్రం ‘ది ఒడిస్సీ’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ వసూళ్లను అధిగమించే అవకాశముందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటికే $346 మిలియన్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతంలోనే $264.1 మిలియన్ల వసూళ్లు నమోదు చేయడంతో పాటు వీక్‌డేస్‌లోనూ మంచి జోరు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐమ్యాక్స్ థియేటర్లలో సినిమాకు లభిస్తున్న స్పందన వసూళ్లకు మరింత బలాన్నిస్తోంది.
ఇదే జోరు కొనసాగితే ‘ది ఒడిస్సీ’ నోలన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ విజువల్స్, థియేట్రికల్ అనుభూతి, ఐమ్యాక్స్ ప్రదర్శనలకు లభిస్తున్న ఆదరణ సినిమా లాంగ్‌రన్‌కు కీలకంగా మారనున్నాయి. థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వసూళ్ల జోరును నిలబెట్టుకుని ‘ది ఒడిస్సీ’ $1 బిలియన్ క్లబ్‌లో చేరుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!