
జనరల్

అంతరిక్షం నుంచి రాత్రివేళలో భారత్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూపిస్తూ నాసా ఒక టైమ్‌లాప్స్ వీడియోను విడుదల చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చిత్రీకరించిన ఈ వీడియోలో భారత్‌తో పాటు శ్రీలంక తీర ప్రాంతాల అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ వీడియోలో ఐఎస్ఎస్ అరేబియా సముద్రం నుంచి దక్షిణ భారత్, శ్రీలంక మీదుగా బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మన్నార్ సింధు శాఖ, బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలు ప్రకాశిస్తూ ఆకట్టుకుంటున్నాయి. నగరాల వెలుగులు, ఆకాశంలో మెరుపులు కలిసి భారత్, శ్రీలంక తీరప్రాంతాలను ఒక మాయా ప్రపంచంలా చూపించాయి. భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఐఎస్ఎస్ పరిభ్రమిస్తుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!