
.png&w=3840&q=75)
జామ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. జామ పండులో విటమిన్ సి, ఫైబర్ మాత్రమే కాకుండా, ఇది యాంటీఆక్సిడెంట్లకు ‘పవర్హౌస్’ కూడా. జామ తినడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. జామలో విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, పొటాషియం, ఫైబర్ వంటి అనేక ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వివిధ ముఖ్యమైన విధులు సజావుగా సాగడానికి సహాయపడతాయి. జామ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందాలంటే ఏ టైంలో తినడం కూడా ముఖ్యం.
ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం భోజనం ముందు: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జామ తినడం మంచిది. ఈ సమయంలో జామ తినడం వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. జామలోని ఫైబర్, సహజ చక్కెరలు రోజంతా శక్తి ఇస్తాయి. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది, కడుపుని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది.
భోజనానికి ముందు లేదా తర్వాత: జామలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఇది ఎక్కువ సేపు కడుపుని నిండుగా ఉంచుతుంది. భోజనానికి ముందు తినడం వల్ల ఎక్కువగా తినడం నివారించవచ్చు, బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మధ్యాహ్నం: మధుమేహ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్నం ఒక జామ తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.
తొక్కతో కలిపి నమిలి తినడం: జామ తొక్క, గింజల్లో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్ ఉంటాయి. కాబట్టి జామను బాగా కడిగి తొక్కతో కలిపి తినడం మంచి దంతాలు మరియు చిగుళ్ల ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుంది.
రోజుకి ఒక జామ తింటే సరిపోతుంది: రోజూ ఒక మధ్యమ సైజు జామ తినడం సరిపోతుంది. ఎక్కువ జామ తినడం వల్ల ఫైబర్ అధికంగా ఉండి కడుపులో అసౌకర్యం లేదా గ్యాస్ ఏర్పడవచ్చు.
చక్కెర జోడించకండి: జామ సహజంగానే తియ్యగా ఉంటుంది. జ్యూస్ చేసేటప్పుడు లేదా ఇతరంగా తినేటప్పుడు చక్కెరను జోడించవద్దు. ఇది పండు సహజ లక్షణాలను తగ్గిస్తుంది మరియు కేలరీలను పెంచుతుంది.
సలాడ్ లేదా పెరుగుతో రుచిగా తినడం: జామను చిన్న ముక్కలుగా కోసి ఫ్రూట్ సలాడ్ లేదా పెరుగుతో కలిపి తినడం వల్ల పోషక విలువలు మరింత పెరుగుతాయి.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!