

వేసవిలో ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పండు పుచ్చకాయ. దాదాపు 92 శాతం నీటిని కలిగి ఉండే ఈ పండు శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. 100 గ్రాముల పుచ్చకాయలో కేవలం 45 కేలరీలు మాత్రమే ఉండటంతో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, లైకోపీన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే దీనిని తినే సమయం మరియు విధానం సరిగా లేకపోతే ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగడం, తరచూ మూత్ర విసర్జన కారణంగా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, జీర్ణ సమస్యలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనల ప్రకారం, పుచ్చకాయను ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తర్వాత ఒకటి లేదా రెండు గంటల తరువాత తీసుకోవడం మంచిది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే శరీరానికి సరైన హైడ్రేషన్ లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!