

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన జొన్న దిబ్బ రొట్టె ఒక సంప్రదాయ వంటకం. పాత కాలంలో పెద్దలు దీన్ని తరచుగా తినేవారు, అందుకే వారు బలంగా ఉండేవారని చెబుతారు. ఈ వంటకం శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రుచికరంగా ఉండే ఈ దిబ్బ రొట్టె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఈ వంటకం తయారికి జొన్న పిండి, బియ్యం రవ్వ, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, నూనె, కొత్తిమీర అవసరం. ముందుగా జొన్న పిండి, పెరుగు, ఉప్పు, నీరు కలిపి మిశ్రమం తయారు చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర జోడించి కలపాలి. చివరగా పెనంపై నూనె వేసి ఈ పిండిని మందంగా పోసి రెండు వైపులా బాగా కాల్చితే రుచికరమైన జొన్న దిబ్బ రొట్టె సిద్ధమవుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!