

ఒక దానిమ్మ పండు వంద వ్యాధులను నయం చేస్తుంది అనే సామెతకు శాస్త్రీయ ఆధారాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండుతో పాటు దాని పువ్వు, బెరడు, వేర్లు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. దానిమ్మలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని జీవక్రియలను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. అందుకే దీనిని ఔషధ గుణాలున్న పండుగా పరిగణిస్తున్నారు.
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దానిమ్మ రసం తీసుకోవడం వల్ల శరీరం పోషకాలను వేగంగా గ్రహిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేసి, ప్రేగులను శుభ్రపరచి, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వాపులు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడి, చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
ఉదయం చక్కెర కలపని తాజా దానిమ్మ రసాన్ని 100–150 మిల్లీలీటర్లు తీసుకుని, 20–30 నిమిషాల తర్వాత అల్పాహారం చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. దానిమ్మ శరీరంలో మంటను తగ్గించడమే కాకుండా, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, మొటిమలను తగ్గించి, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. అదనంగా, కొన్ని అధ్యయనాల ప్రకారం దానిమ్మ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉండగా, అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది ఉపయోగకరమైన పండుగా భావిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!