

వరి బియ్యానికి బదులుగా చాలా మంది ఇప్పుడు మిల్లెట్ బియ్యాన్ని తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఇందులో అధికంగా ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఉండటంతో షుగర్, బీపీ నియంత్రణలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి బరువు తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రస్తుతం ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్న నేపథ్యంలో చిన్న వయసులోనే మధుమేహం, బీపీ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిల్లెట్స్‌ను డైట్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి మంచి ఫలితాలు ఇస్తాయి.
మిల్లెట్ బియ్యం తయారీకి ఒక కప్పు మిల్లెట్స్, రెండు గ్లాస్‌ల నీరు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె తీసుకోవాలి. ముందుగా మిల్లెట్స్‌ను రెండు సార్లు కడిగి 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీటిని మరిగించి అందులో మిల్లెట్స్, ఉప్పు, నెయ్యి వేసి ఉడికించాలి. ఈ మిల్లెట్ బియ్యాన్ని పప్పు, సాంబార్, కూరలు లేదా పెరుగుతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!