

చలికాలం రాగానే చాలా మందికి చర్మం పొడిబారడం, పగలడం, దురదలు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. చల్లని గాలిలో ఉండే పొడితనం చర్మంపై ప్రభావం చూపి, పొట్టు రావడం, కాంతి తగ్గడం, డల్‌గా కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా తేమ తగ్గిపోవడంతో చర్మం త్వరగా రఫ్‌గా మారుతుంది. అందుకే ఈ సీజన్లో చర్మ సంరక్షణ కోసం ఆహారపు అలవాట్లు మార్చడం చాలా అవసరం. చల్లటి వాతావరణం చర్మంలోని సహజ తేమను బయటకు లాగేస్తుంది. ఫలితంగా చర్మం పొడిగా, బలహీనంగా మారి చిన్న చిన్న పగుళ్లు రావడం, దురదలు కలగడం జరుగుతుంది. అయితే సరైన ఆహారాన్ని తీసుకుంటే చర్మానికి తేమ నిలిచి బలంగా ఉండేలా చేయవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్న ఆహారాలు చలికాలంలో చర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి చాలా మంచివి. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల చర్మంపై కనిపించే ఎర్రబడటం, దురద, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
చర్మంలో తేమను నిలుపుకోవడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. దీంతో చర్మం పొడిబారకుండా తేమగా, మృదువుగా మారుతుంది. చర్మంపై సహజ కాంతి పెరుగుతుంది.
ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలు:
చేపలు
వాల్నట్స్
చియా విత్తనాలు
అవిసె గింజలు
అవకాడో
ఆలివ్ ఆయిల్
బాదం
బ్రెజిల్ నట్స్
పొద్దుతిరుగుడు విత్తనాలు
ఇవిలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, జింక్ చర్మాన్ని లోపలినుంచే రక్షిస్తాయి.
నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు చర్మానికి తేమను అందించడంలో అత్యంత ఉపయోగకరమైనవి. కీరదోస, పుచ్చకాయ, నారింజ, కొత్తిమీర వంటి ఆహారాలు చర్మాన్ని లోపల నుంచే హైడ్రేట్ చేస్తాయి.
అదే విధంగా చికెన్ సూప్ లేదా వెజిటేబుల్ సూప్ తాగినా చర్మానికి తేమ అందుతుంది.
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలు చర్మ కణాల నష్టాన్ని తగ్గించి కణాలను బలంగా ఉంచుతాయి. చర్మం సహజ కాంతి తిరిగి పొందుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు:
క్యాప్సికం
బ్రోకలీ
కివి
పాలకూర
క్యారెట్
చిలగడదుంప
గుమ్మడికాయ
పప్పు దినుసులు
శనగలు
ఈ ఆహారాలు చర్మ ఉష్ణోగ్రత నియంత్రణలో కూడా సహాయపడతాయి.
చలికాలంలో ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవడం చర్మానికి చాలా అవసరం. ఇవి చర్మంలో వాపులు తగ్గించి, చర్మ కణాలను రక్షిస్తాయి. ప్రోబయోటిక్స్ చర్మాన్ని లోపలినుంచే బలపరచడం వల్ల చర్మం పగలకుండా, పొడిబారకుండా ఉంటుంది.
ప్రోబయోటిక్ ఆహారాలు:
పెరుగు
మజ్జిగ
పాలు
ఇవి చర్మానికి సహజ తేమను అందిస్తాయి.
అదనంగా చలికాలంలో చర్మం రక్షించుకోవాలంటే:
మద్యం అధికంగా సేవించకూడదు
టీ, కాఫీ ఎక్కువగా తాగకూడదు
చక్కెర పానీయాలను మానేయాలి
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని దూరంగా పెట్టాలి
ఇలా ఆహారంలో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కూడా చర్మం పగలకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
NOTE:
ఇవి కేవలం అవగాహన కోసమే. మీ ఆరోగ్య సమస్యలను బట్టి మార్పులు ఉండొచ్చు. అనుమానాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!