

ప్రతీ విషయంలోనూ అందరికీ బిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఫుడ్ విషయంలోనూ అంతే.
ఒకరు రోజుకి రెండు పూటలూ తినాలని చెబితే, మరొకరు మూడుపూటలూ తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.
అసలు హెల్దీగా ఉండాలంటే రోజుకి ఎన్నిసార్లు తినాలి?
ఆ ఆహారం కూడా ఉదయం, సాయంత్రం ఎప్పుడు తింటే మంచిది?
ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని తీరాలి.
బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైమ్‌కి చేయాలి, ఎలా తింటే శరీరం చక్కగా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అదే విధంగా, షుగర్ ఉన్నవారు తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం మాత్రమే కాదు,
తినే ఆహారాన్ని ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవడం కూడా ముఖ్యం.
తినే ఆహారం ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏ టైమ్‌లో తినాలి — ఇవన్నీ తెలుసుకోవాలి.
కొంతమంది రోజుకి రెండుసార్లు తింటారు, మరికొంతమంది మూడుసార్లు,
ఇక మరికొందరు తక్కువతక్కువ మొత్తంలో రోజుకి నాలుగుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు తింటారు.
నిజానికి ఆరోగ్యాన్ని కాపాడడంలో రోజుకి ఎన్నిసార్లు తినాలి అనేది తెలుసుకోవడం అవసరం.
చాలా మంది నిపుణుల ప్రకారం, బ్రేక్‌ఫాస్ట్ రోజూ కచ్చితంగా చేయాలి.
దీనిని తీసుకోవడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది.
రాత్రంతా ఫుడ్ లేకుండా ఉన్న బాడీకి బ్రేక్‌ఫాస్ట్ ఫ్యూయల్‌లా పనిచేస్తుంది.
దీంతో బాడీ యాక్టివ్‌గా మారుతుంది, నీరసంగా ఉండదు.
బ్రేక్‌ఫాస్ట్ హెల్దీగా ఉండాలి — జంక్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ కాదు.
ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఎగ్స్, పనీర్ వంటి వాటిని తీసుకోవడం మంచిది.
దీని వల్ల నెక్స్ట్ మీల్ వరకూ ఆకలి ఉండదు.
ఫైబర్ తీసుకోవడం కూడా మంచిది.
బ్రేక్‌ఫాస్ట్ తిన్న వారితో పోలిస్తే తినని వారు బరువు ఎక్కువగా పెరుగుతారు అని అధ్యయనాలు చెబుతున్నాయి.
తక్కువగా తింటే మెటబాలిజం బాగా పనిచేస్తుందనేది అపోహ మాత్రమే.
మన ఆహారం జీర్ణం కావడం వల్ల జీవక్రియ పెరుగుతుంది కానీ,
ఆ శక్తి కూడా మనం తినే ఆహారం నుండే వస్తుంది.
రెండుసార్లు తిన్నా ఎక్కువ పరిమాణంలో తింటే, అది ఎక్కువసార్లు తిన్నట్టే అవుతుంది.
తినే ఆహారం ఎన్నిసార్లు తిన్నాం కంటే ఎంత తిన్నాం అన్నది ముఖ్యం.
రెగ్యులర్‌గా తిన్నంత మాత్రాన మెటబాలిజం రేట్ లేదా కేలరీ బర్న్ పెరగదు.
షుగర్ ఉన్నవారి విషయంలో పెద్ద డౌట్ ఏంటంటే —
రక్తంలో షుగర్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి రెగ్యులర్‌గా తినాలా?
కొంతమంది తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని చెబుతారు.
కానీ దీనికి సైన్స్ పరంగా ఆధారాలు లేవు.
కొద్దికొద్దిగా తినడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది కానీ,
షుగర్ లెవల్స్‌పై పెద్ద ప్రభావం ఉండదు.
అయితే అధ్యయనాల ప్రకారం —
ఉదయం ఎక్కువగా తిన్న వారు రోజంతా షుగర్ లెవల్స్‌ను బాగా నియంత్రిస్తారు.
ప్రస్తుతం బరువు తగ్గడానికి చాలా మంది ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నారు.
దీని వల్ల శరీర కణాల్లో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు క్లియర్ అవుతాయి,
మెటబాలిజం మెరుగుపడుతుంది.
అయితే, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదో —
అది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
ఫాస్టింగ్ ప్రారంభించే ముందు డాక్టర్ సలహా తప్పనిసరి.
రోజుకి తక్కువతక్కువగా ఎక్కువసార్లు తినడం వల్ల ఎలాంటి ప్రత్యేక లాభాలు లేవు.
రెగ్యులర్‌గా తినడం వల్ల షుగర్ లెవల్స్ ఒక్కసారిగా మెరుగవ్వవు.
ఎప్పుడు తిన్నా పరిమాణం కంట్రోల్లో ఉండాలి.
ఆకలిగా అనిపించినప్పుడు తినండి,
కడుపు నిండగానే ఆపండి.
డిన్నర్ ఎర్లీగా చేయడం,
బరువుని మరియు ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
దానికి అనుగుణంగా పోర్షన్ కంట్రోల్ పాటించాలి.
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే.
ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.
వీటిని పాటించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!