

నేటి ఆధునిక జీవనశైలిలో ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అంతర్గత కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు సాధారణమయ్యాయి. తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నామని ఆందోళన చెందుతున్న వారు, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకునే వారు సొరకాయను తమ ఆహారంలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను “ఎనిమీ డైట్స్”గా, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను “ఫ్రెండ్లీ డైట్స్”గా గుర్తించాలి. ఈ నేపథ్యంలో ప్రకృతిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన కూరగాయలలో సొరకాయ ఒకటి. చాలామంది దీనిని సాధారణ కూరగాయగా భావించినా, ఇందులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ముఖ్యమైనవి. 100 గ్రాముల సొరకాయలో సుమారు 96 శాతం నీరు ఉండటం విశేషం.
పోషక విలువల పరంగా చూస్తే, 100 గ్రాముల సొరకాయలో కేవలం 12 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు 2.5 గ్రాములు, ప్రోటీన్ 0.3 గ్రాములు, ఫ్యాట్ 0.1 గ్రాములు మాత్రమే ఉంటాయి. తక్కువ క్యాలరీలు, అధిక నీటి శాతం కారణంగా ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించి పొట్ట నిండిన భావనను ఇస్తుంది. అంతేకాకుండా, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సొరకాయను చేర్చడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.
అదనంగా, సొరకాయలో ఉన్న డైయూరిటిక్ లక్షణాలు మూత్రవిసర్జనను పెంచి శరీరంలోని అధిక నీటిని బయటకు పంపిస్తాయి. దీని వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి, కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇందులోని మినరల్స్, నీటి శాతం శరీరంలో క్షార స్వభావాన్ని పెంచి ఆమ్లత్వాన్ని తగ్గిస్తాయి. సొరకాయను కూరగా లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు. జ్యూస్ తయారు చేసే సమయంలో లేత సొరకాయ తొక్కను కూడా ఉపయోగించవచ్చు. చిన్నప్పటి నుంచే పిల్లలకు సొరకాయను అలవాటు చేయడం వల్ల ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుంది. సొరకాయను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.







.jpg&w=3840&q=75)

.jpeg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!