

ఆంధ్ర స్టైల్ పచ్చి మిర్చి పచ్చడి చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి పచ్చి మిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, నూనె, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వంటి పదార్థాలు అవసరం. ముందుగా పచ్చి మిర్చిని కడిగి ముక్కలుగా కోయాలి. చింతపండును నీటిలో సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి పచ్చి మిర్చిని మృదువుగా అయ్యే వరకు వేయించాలి. మరో పాన్‌లో జీలకర్రను వేయించి చల్లారనివ్వాలి.
తరువాత వేయించిన మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు కలిపి మిక్సీలో కొద్దిగా ముద్దలా లేదా గ్రైండ్ చేసి పేస్ట్‌గా చేసుకోవాలి. చివరగా చిన్న పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి పచ్చడిపై పోయాలి. అంతే రుచికరమైన పచ్చి మిర్చి పచ్చడి సిద్ధం.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!